Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓటర్ జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి: ఎంపీడీవో

ఓటర్ జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి: ఎంపీడీవో

- Advertisement -

నవతెలంగాణ – తుర్కపల్లి
సెప్టెంబర్ 6 ప్రభాతవార్త జడ్పిటిసి ,ఎంపిటిసి ఎలక్షన్ 2025 సంవత్సరానికి సంబంధించి తుర్కపల్లి మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకై డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను, ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాను విడుదల చేసినట్లు ఎంపీడీవో లెంకల గీతారెడ్డి తెలిపారు. శనివారం తుర్కపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఓటరు జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో మొత్తం 55 పోలింగ్ స్టేషన్లో 27,977 ఓటర్లు ఉన్నారని, అందులో పురుషులు 13846,మహిళలు 14,131 మంది ఉన్నారని అన్నారు. తుర్కపల్లి మండలంలోని 33 గ్రామపంచాయతీలో కూడా ఓటర్ లిస్టు పోలింగ్ స్టేషన్ ల జాబితాను విడుదల చేసినట్టు తెలిపారు. ఓటర్ జాబితా, ముసాయిదా పోలింగ్ స్టేషన్ల పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 8వ తేదీ వరకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ వెంకటేశ్వర్లు,సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ సంతోష్, పంచాయతీ ఆపరేటర్స్ ఎండి ఇమ్రాన్ ఎం లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -