Saturday, December 27, 2025
E-PAPER
Homeమానవిఐరన్‌ లోపిస్తే…

ఐరన్‌ లోపిస్తే…

- Advertisement -

తొందరగా అలిసిపోవటం, చెమటలు బాగా పట్టడం, కళ్ళు తిరగడం, ఇలాంటివన్నీ కూడా ఐరన్‌ లోపం వల్ల వచ్చే సమస్యలు. కొన్నిసార్లు సమస్య ఎక్కువగా ఉంటే స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. శరీరంలోని ఎర్ర రక్తకణాలు పనిచేయకపోవడం వల్ల ఐరన్‌ లోపం ఏర్పడుతుంది. దీనినే రక్తహీనత అంటారు. దీని నివారణకు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. కొన్ని ఫుడ్స్‌ని చేర్చుకోవాలి.

బీట్‌ రూట్‌ :
చూడ్డానికే ఎర్రగా కనిపించే బీట్‌రూట్‌లో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలెన్నో ఉంటాయి. అయితే దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ, దీనిని తినడం వల్ల బాడీలో ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతారు. బీట్‌రూట్‌లో ఐరన్‌ పుష్కలంగా ఉండడం వల్ల హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. అయితే, దీనిని మితంగా తీసుకుంటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

గుమ్మడి గింజలు :
వీటిల్లోని పోషకాలను అద్భుతమనే చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా, ఈ విత్తనాల్లో మెగ్నీషియం, కాపర్‌, ప్రోటీన్‌, ఐరన్‌, జింక్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
రక్తహీనతతో బాధపడే వారు రెగ్యులర్‌గా వీటిని తింటే సమస్య దూరమవుతుంది. ఎందుకంటే ఇందులో ఐరన్‌ శాతం అధికంగా ఉంటుంది.
వీటితోపాటు ఐరన్‌ లోపాన్ని తగ్గించేందుకు రెడ్‌ మీట్‌, బచ్చలికూర, గోంగూర వంటి ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకోవాలి. వీటితో విటమిన్‌ సి పండ్లు, కూరగాయలు తీసుకుంటూ టీ, కాఫీలకి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -