- Advertisement -
-ఎస్ఐ సౌజన్య హెచ్చరిక
-రోడ్లపై నిల్వ చేసిన వ్యాపార వస్తువుల తొలగింపు
నవతెలంగాణ-బెజ్జంకి
రోజురోజుకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా రోడ్లపై వాహనాలు నిలిపినా..రోడ్లను అక్రమించి వ్యాపారాలు నిర్వహించిన రూ.15 వేలు జరిమాన విధిస్తామని ఎస్ఐ సౌజన్య హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలో రోడ్లను అక్రమించి నిల్వ చేసిన వ్యాపార వస్తువులను ఎస్ఐ తొలగింపు చేపట్టారు. అనంతరం పలువురు వ్యాపారులు,భవన యజమానులతో ఆమె సమావేశం నిర్వహించారు. రోడ్లను ఆక్రమించి వస్తువులు నిల్వ చేసిన, వ్యాపారం నిర్వహించిన, రోడ్లపై వాహనాలను నిలిపిన గురువారం నుంచి రూ.15 వేలు జరిమాన విధించాలని ఎస్ఐ పంచాయతీ కార్యదర్శికి సూచించారు.
- Advertisement -



