Sunday, September 21, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంయుద్ధమొస్తే.. అండగా సౌదీ

యుద్ధమొస్తే.. అండగా సౌదీ

- Advertisement -

పాక్‌ రక్షణ మంత్రి వెల్లడి
ఇస్లామాబాద్‌ : భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుదేశాల మధ్యన యుద్ధమంటూ వస్తే తమకు అండగా సౌదీ అరేబియా పోరాడుతుందని పాకిస్తాన్‌ రక్షణ మంత్రి ఖవాజ్‌ ఆసిఫ్‌ అన్నారు. ఇటీవల పాక్‌ – సౌదీ అరేబియా మధ్య రక్షణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్‌ మాట్లాడారు. పాక్‌- భారత్‌ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు సౌదీ దళాలు మీకు తోడుగా నిలబడతాయా అన్న ప్రశ్నకు ‘కచ్చితంగా.. ఎలాంటి సందేహం లేదు’ అని ఆయన బదులిచ్చారు. ‘పాక్‌, సౌదీ ఏ దేశాన్ని దురాక్రమణదారుగా పేర్కొనలేదు. ఈ ఒప్పందం కేవలం ఇరువైపుల ఒక రక్షణగోడ లాంటిది. ఇరుదేశాల్లో దేని మీదైనా.. మరో దేశం దురాక్రమణకు పాల్పడితే సంయుక్తంగా కలిసి పరిష్కరించుకుంటాం. ఈ ఒప్పందం దురుద్దేశంతో చేసుకున్నది కాదు. కానీ, ఎవరైనా తమను బెదిరించాలని చూసినప్పుడు కూడా ఇది అమల్లోకి వస్తుంది’ అని ఆసిఫ్‌ పేర్కొన్నారు. అలాగే పాక్‌ అణ్వాయుధాలను సౌదీ కూడా ఉపయోగించు కోవచ్చని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -