Thursday, February 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధి చేస్తా..

ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధి చేస్తా..

- Advertisement -

బిఆర్ఎస్ అభ్యర్థి సాతాని శ్రీశైలం 
నవతెలంగాణ-సదాశివపేట 

వార్డు ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని బిఆర్ఎస్ 10వ వార్డు అభ్యర్థి సాతాని శ్రీశైలం అన్నారు. బుధవారం బిఆర్ఎస్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి సాతాని శ్రీశైలం మాట్లాడుతూ.. వార్డు ప్రజలు తనని ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధితో పాటు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి తనవంతు నిస్వార్థ సేవలు అందిస్తానని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తి విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ప్రజలకు అందజేసి కాంగ్రెస్ మోసాలను ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, వార్డును మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇంచార్జి , పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు , కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -