నిరాధారమైన ఆరోపణలు చేస్తే బొందపెడతాం : వి ప్రకాశ్‌కు జాగృతి నేతలు రూప్‌సింగ్, ఇస్మాయిల్ హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై అవాకులు, చవాకులు పేలితే వి ప్రకాశ్ నాలుక చీరేస్తామని జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్‌సింగ్, సీనియర్ నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ హెచ్చరించారు. నిరాధారమైన ఆరోపణలు, నిందలు వేస్తే బొందపెడతామని అన్నారు. సోమవారం హైదరాబా ద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ హరీశ్‌రావు ఫేక్ టీమ్‌కు ప్రకాశ్‌ను లీడర్‌గా ఎంపిక చేసినట్టుదన్నారు. ప్యాకేజీ స్టార్‌గా ఉన్న ఆయన సుపారీ ఇచ్చిన లీడర్‌కు ఊడిగం చేసినట్టున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్ ఓటమికి కేసీఆర్, కేటీఆర్‌ల వైఖరే కారణమ ంటూ ప్రకాశ్ గతంలో మాట్లాడారని గుర్తు చేశారు. నీళ్ల విషయంలో రౌండ్‌టేబు ల్ సమావేశాలను ఏర్పాటు చేసిన కవితను పొగిడారని అన్నారు. ఆర్నెల్లలో ఏం మారిందని ప్లేట్ మార్చారని ప్రశ్నించారు. కవిత అవినీతిలో కూరుకుపోయిం దంటూ బద్నాం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఆమెపై తప్పుడు ప్రచారాలు చేస్తే సరైన సమాధానం చెప్తామని అన్నారు.
కవితను విమర్శిస్తే నాలుక చీరేస్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



