సాధారణంగా కళ్ల కింద నల్లటి వలయాలు చాలా మందికి ఏర్పడుతుంటాయి. నల్లటి వలయాలను తగ్గించుకునేందుకు కొన్ని ఇంటి చిల్కాలను చూద్దాం..
– కీర దోసను ముక్కలుగా కట్ చేసి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరువాత వాటిని పావుగంట పాటు కళ్లపై పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు తగిన విశ్రాంతి లభిస్తుంది. నల్లటి వలయాలు నెమ్మదిగా దూరమవుతాయి.
– బంగాళదుంపను గుజ్జుగా చేసి, ఆ గుజ్జును కళ్లపై పావుగంట పాటు ఉంచితే చాలు మంచి ఫలితం ఉంటుంది. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే కళ్ల కింది నల్లటి వలయాలు దూరమవుతాయి.
– టొమాటోను కట్ చేసి ముక్కలను కళ్లపై పెట్టుకోవాలి. పావుగంట పాటు అలా వదిలేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఒక టీస్పూన్ టొమాటో జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం కలిపి కళ్ల కింద అప్లై చేసినా ఫలితం కనిపిస్తుంది.
– గ్రీన్‌టీలో ఉండే యాంటీఆక్సి డెంట్లు, కెఫిన్ డార్క్ సర్కిల్స్‌ను దూరం చేయడంలో ఎంతగానో సహాయపడతాయి. గ్రీన్ టీ తయారు చేసుకున్నాక ఆ టీ బ్యాగ్‌ని పడేయకుండా ఫ్రిజ్‌లో పెట్టాలి.చల్లటి టీ బ్యాగ్ ని కళ్లపై పెట్టుకుంటే మంచి ఫలితముంటుంది.
– కొద్దిగా దూది తీసుకుని రోజ్ వాటర్‌లో ముంచి కళ్లపై పెట్టుకోవాలి. పావుగంట పాటు ఇలా చేయడం వల్ల కళ్లు రీఫ్రెష్ అవుతాయి. దీంతో నల్లటి వలయాలు పోతాయి.
వారం పాటు ఇలా చేస్తే..
- Advertisement -
- Advertisement -