Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇవ్ టీజింగ్‌ చేస్తే షీటీంకు సమాచారం ఇవ్వాలి ..

ఇవ్ టీజింగ్‌ చేస్తే షీటీంకు సమాచారం ఇవ్వాలి ..

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, ఈవ్‌ టీజింగ్‌ చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలని  సబ్ డివిజన్ షీ టీం కానిస్టేబుళ్లు, విగ్నేష్‌, సుమతిలు అన్నారు. మండలంలోని పరిషత్  ఉన్నత పాఠశాలలో దేగాం  గురువారం సైబర్ క్రైమ్ గురించి విద్యార్థినిలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినిలు, ఉద్యోగినిలు, మహిళలు ఈవ్‌టీజింగ్‌, వేధింపులకు గురైతే పోలీస్‌ శాఖ ఏర్పాటు చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన మహిళలు, విద్యార్థినిల పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈవ్‌ టీజింగ్‌కు గురయ్యేవారు భయపడకుండా సమాచారం ఇస్తే రక్షణ కల్పిస్తామన్నారు. షీ టీం నెంబర్‌ 8712659795కు, డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా షీ టీం వారికి ఫిర్యాదు చేసే విధానాన్ని మహిళలకు వివరించారు.. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు    ఉపాధ్యాయులు ,దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది , విద్యార్థిని విద్యార్థులు  పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img