Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లక్ష్యం ఉంటే ఉన్నత స్థాయి సాధిస్తారు 

లక్ష్యం ఉంటే ఉన్నత స్థాయి సాధిస్తారు 

- Advertisement -

– తోటపల్లి పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

విద్యార్థులు చిన్ననాటి నుండే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే ఉన్నత స్థానాలు సాధించగలరని సర్పంచ్ బంక లక్ష్మీ చందు అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులకు వీడ్కోలు, పాఠశాల వార్షికోత్సవ దినోత్సవం  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బంక లక్ష్మీ చందు మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఐదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు కేక్ కట్ చేసి తినిపించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గాంధీ, ఉపాధ్యాయులు గాజుల భాగ్యలక్ష్మి, పోషవేణి రాధిక, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -