Wednesday, April 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమీ గొంతునొక్కితే..

మీ గొంతునొక్కితే..

- Advertisement -

16 గంటలు ఎలా మాట్లాడగలిగారు?
-బీఆర్‌ఎస్‌ వల్ల 4.56 గంటల సభాసమయం వృధా : ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఇటీవల నిర్వహించిన శాసనసభా సమావేశాలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌… తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ విమర్శించారు. అధికార పక్షం తమ గొంతు నొక్కిందంటూ ఆ పార్టీ శాసనసభా పక్ష ఉప నేత హరీశ్‌రావు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీ రికార్డుల ప్రకారం కాంగ్రెస్‌ సభ్యులు 13 గంటలు మాట్లాడితే.. బీఆర్‌ఎస్‌ సభ్యులు 16 గంటలు మాట్లాడారని తెలిపారు. ‘మేం గొంతునొక్కామని మీరు అంటున్నారు.. నిజంగా అదే జరిగితే 16 గంటల పాటు మీ పార్టీ సభ్యులు ఎలా మాట్లాడగలిగారు…?’ అని హరీశ్‌రావును ప్రశ్నించారు.
మంగళవారం హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ప్రభుత్వ విప్‌లు యెన్నం శ్రీనివాసరెడ్డి, విజయ రమణారావు, బీర్ల ఐలయ్య, వేముల వీరేశంతో కలిసి ఆది శ్రీనివాస్‌ మాట్లాడారు. కీలకమైన బడ్జెట్‌ సమావేశాలకు సైతం ప్రధాన ప్రతిపక్ష నేత గైర్హాజరు కావటం శోచనీయమని అన్నారు. బీఆర్‌ఎస్‌ గందరగోళం వల్ల సభలో 4.56 గంటల విలువైన సమయం వృథా అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీ సభ్యులు బడ్జెట్‌ ప్రతులను చించి, చెవుల్లో పెట్టుకోవటం ద్వారా అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చారని దుయ్యబట్టారు. సభ నుంచి సస్పెండ్‌ కావాలనే ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్‌ సభ్యులు… మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరును ప్రస్తావించారని విమర్శించారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో తాము అర్థవంతమైన చర్చలు చేపట్టామని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -