Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కష్టపడి చదివితే ఉన్నత స్థాయి సాధించవచ్చు 

కష్టపడి చదివితే ఉన్నత స్థాయి సాధించవచ్చు 

- Advertisement -

– మెడికల్ సీట్ సాధించిన విద్యార్థులకు అభినందన 
– సర్ సివి రామన్  పాఠశాల ప్రిన్సిపల్ కాయిత నారాయణరెడ్డి 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

కష్టంతో ఇష్టపడి చదివితే ఉన్నత స్థానం సాధించవచ్చునని సర్ సివి రామన్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ కాయిత నారాయణరెడ్డి అన్నారు. సర్ సివి రామన్ పాఠశాల పూర్వ విద్యార్థులు బొమ్మగాని హారిక, కేడిక శ్రీలక్ష్మి, వెల్దండి విష్ణులు వైద్య విద్య ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించే నీట్ పరీక్షలో ఉత్తమ ర్యాంకులను సాధించి ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడికల్ సీట్ సాధించడం పట్ల సోమవారం పాఠశాలలో వారిని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని మంచి భవిష్యత్తు కోసం జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

ఎలాంటి అవాంతరాలు ఎదురైనా చదువును నిర్లక్ష్యం చేయకుండా పట్టుదలతో  చదువుతే భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించవచ్చని అన్నారు. గొప్ప గొప్ప వ్యక్తులను, మన పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని మంచి భవిష్యత్తు కోసం జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా మెడికల్ సీట్ సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ.. మన పాఠశాలలో నేర్చుకున్న విద్య నైతిక విలువలు మా భవిష్యత్తుకు పునాదిగా ఏర్పడి మంచి కళాశాలలో సీటు సాధించేందుకు కారణమైందని ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, గురువులు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -