ఎంబీబీ సీట్ సాధించిన విద్యార్థినికి ఘణ సన్మానం..
నవతెలంగాణ – జన్నారం
విద్యార్థులు క్రమశిక్షణతో చదివితేనే ఉన్నత శిఖరాలలో నిలుస్తారని మండల కేంద్రంలో ఇంగ్లీష్ స్కూల్ ప్రిన్సిపల్ మధు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జయరాణి ఇ/మీ హై స్కూల్ నందు చదివిన సుల్వా అభినయ ఇటీవల వెలువడిన ఫలితాలలో ఎంబిబిఎస్ సీటు సాధించిన సందర్భంగా ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు ఆ విద్యార్థినికి శాలువాకూడలతో సత్కరించారు. సందర్భంగా ప్రిన్సిపల్ మధు మాట్లాడుతూ.. అభినయ జయరాణి పాఠశాల లో నర్సరీ నుండి పదవ తరగతి వరకు(2022- 2023)పూర్తిచేసి.. ఇప్పుడు మంచిర్యాల ల లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ సీట్ సాధించిన గర్వకారణమన్నారు. అభినయ ఎంబిబిఎస్ పూర్తి చేసి ఉన్నత చదువులు చదివి పేద ప్రజలకు సేవలు అందించాలన్నారు. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎందరో అద్భుత విజయాలను సాధించారని, కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా విద్యార్థులకు విద్యను అందించడమే మా విద్యాసంస్థ యొక్క ఉద్దేశం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
క్రమశిక్షణతో చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES