Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేస్తా

ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేస్తా

- Advertisement -

అయిటిపాముల సర్పంచ్ అభ్యర్థి పబ్బు వెంకటేశ్వర్లు 
నవతెలంగాణ – కట్టంగూర్
తనను ఆదరించి గెలిపిస్తే గ్రామాన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో మరింత అభివృద్ధి చేస్తా నని మండలంలోని అయిటిపాముల మేజర్ గ్రామ పంచాయతీ బీజేపీ పబ్బు వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ప్రచారంలో భాగంగా పార్టీనాయకులు,కార్యకర్తలతోకలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటర్లను ఓటు అభ్యర్థిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గ్రామ ఎంపీటీసీగా పని చేసి ప్రజా సమస్యలతో పాటు మౌలిక వసుతు కల్పించాన ని తెలిపారు. ప్రతి నిత్యం ఊరు శ్రేయస్సు కోసం తపించే తనను గెలిపించాలని కోరారు.

తాను గెలిస్తే గ్రామంలోని ప్రతి ఒటరుకు రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పించడంతో పాటు సంవత్స రం పాటు విద్యార్థులకు ఉచిత వైఫై నెట్ వర్క్ అందజేస్తానిన తెలిపారు. గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టి గ్రామంలోని ప్రతి వీధికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల సమస్యలను తన సమస్యలు గా భావించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనను అక్కున చేర్చుకొని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే కేంద్రం నుంచి రూ.2కోట్ల నిధులు తెప్పించి గ్రామంలో మౌలిక వసతులు కల్పించి జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -