Sunday, May 11, 2025
Homeసోపతిసెప్పినట్లింటే సెప్పరానంత లాభం

సెప్పినట్లింటే సెప్పరానంత లాభం

- Advertisement -

గూడ్‌ మానింగ్‌ పిల్లలు అందరొచ్చేసిండ్రా? చానా మంచిగై పోతుండ్రు దినామ్‌ దినామ్‌ టైం రాజాల్తుండ్రంటే పొద్దుగాల లేస్తున్నారన్నమాట అమ్మ గిట్ట పండ్లు సాయ పడుతుండ్రా లేదా ఏపట్లలెక్క ధ్యానం అయితే చేయాలి కదా.
సెప్పినట్లింటే సెప్పరానంత లాభం
సెప్పినట్లింటే సెప్పరానంత లాభం
పదోది రిజల్ట్స్‌ వచ్చింది కదా రమేష్‌. మీ అన్న ఎల్లిండా లేదా ఏంది మూడిట్లో పోయిండా ఏం కాదులే బుగులు పడొద్దని చెప్పు మల్ల ఒక్క నెలలో ఇస్తాంట్లు ఉంటాయి అవి రాస్తే వెళ్తాడు లే భయపడి చదవకుండా ఉండగల. మన ఊర్లో టుసండ్లు ఉండవాఏ మీకు మీరే సాయ పడుకోవాలి పెద్ద కిలాసోళ్లు పాసైనోళ్ళు తమ్ముళ్లు అనుకొని చెల్లెళ్లు అనుకొని ప్రేమతో ని చదివిస్తే పని అయితది గది మీకు కూడా లాభమే మాకేం వస్తది అనుకోవద్దు మొత్తానికి మన ఊర్ల అందరు బాగుపడా లే ఇంకా ముందు కాలం అంతా మన ఊరు మీసేతులనుగా ఉంటది
అసలికి అందరూ దినం ఒక పాళీ అ ఆ లు గుణింతాలు ఒత్తులు రాస్తుండాలి కవి మంచిగా చదవనీకే రాయి నీకే తప్పులు లేకుండా ఓస్తది. చిన్న కిలాసం పొరలు దినం రాసి అన్నలకు సూపియండి ఓ ప చెప్పుండ్రి మీరు కూడా దినం రాస్కె రావాలి చేతిరాత సక్కంగా లేనోళ్లు కొత్త నోట్‌ బొగ్గు కొనుక్కొని సికిస్నాన్న తోని పైన రాపించుకొని కింద అంత దిద్దున్రి మీరు కూడా అన్న లెక్క రాయజాల్తారు. ఈరోజు తారీకు ఎంత? 11.. అయ్యో ఇంకా నెలనే ఉన్నాయి.
7 తారీఖు అందరు మంచిగా చేసిండ్రు, గది చదువుతుంటే నాకు మస్తు సంతోషం అయింది. మనం కూడా సాంతినికేతన్‌ లెక్కనే చదువుతున్నం గదంటాని ఎండ లు మొదలుకాంగనే ఆడంకాడంగా తులసిత్తులు చల్లిన రెండు మూడు ఆనలు మొలసి ఇంత ఎత్తయినరు చూడండి. తులసి చెట్టు ఉన్న కాడ అన్ని లాభాలే. తులసి చెట్టు కాడ జ్వరం, తగ్గు, సరిది, నెత్తి నొప్పి అన్ని డాక్టర్‌ లెక్కనే చెడ్డతనాన్ని దగ్గరకి రానీయదంట అందుకే మీ ఇంటి కాడ కూడా ఇంకెన్ని తులసితులు నాటోండ్రీ, వానకాలం వస్తే ఆటంతట్టావే పెరుగుతాయి డబిట్‌ కాలనీ కూసోవచ్చు, చదువుకోవచ్చు, అన్ని పనులు ఆ గాలి పిలుస్తా చేసుకోవచ్చు.
నోట్బుక్కుల అట్టలు పట్టుక రండి. ఇగో గుండ్రంగా నమ్ముతా మట్టం మీద పెట్టి పెన్సిల్‌ తో గీసి కట్‌ చేయాలి. ఇప్పుడు చూడండి మూతలు వచ్చింది కదా దీనిమీద రంగు పెన్సిలు స్కెచ్‌ పెను తోని బొమ్మలు, పువ్వులు, తీగలు దించొచ్చు. లేకుంటే గొప్పల ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు అక్క పెట్టొచ్చు. గిలాస్లా దుమ్ముదులి పడకుండా దీన్ని ఆడుకుని వచ్చింది గిట్టలతోనే సంకలు ఏమన్నా చేయొచ్చు. గట్టిగా ఉన్నాయి కదా. ఇంకా ఇండ్లకు పోయి అన్నలు తిని మళ్లీ అప్పటికి రండ్రి.

  • గంగరాజ పద్మజ, 9247751121
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -