Tuesday, February 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమరోసారి కాంగ్రెస్‌కు ఓటేస్తే మరింత గోసే

మరోసారి కాంగ్రెస్‌కు ఓటేస్తే మరింత గోసే

- Advertisement -

ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి

నవతెలంగాణ-సూర్యాపేట
రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, మరోసారి కాంగ్రెస్‌కు ఓటేస్తే మరింత గోస పడక తప్పదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని కొత్త బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సీఎం, మంత్రి వర్గమంతా దోచుకునే పనిలో పడ్డారని, మంత్రుల మధ్య సఖ్యత లేక ఒకరి బండారం ఒకరు బయట పెట్టుకుంటున్నారని విమర్శించారు. పంపకాల పంచాయితీలు కాదు, రాసలీలల పంచాయితీలు పెట్టుకోవడం కాంగ్రెస్‌ రాజకీయాలకు నిదర్శనమన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -