Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeమానవివేగంగా నడిస్తే..

వేగంగా నడిస్తే..

- Advertisement -

నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని సులభమైన వ్యాయామాల్లో ఒకటిగా పేర్కొంటారు వైద్య నిపుణులు. రోజూ వాకింగ్‌ చేస్తే ఎన్నో రోగాలు నయమవుతాయని, శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. అయితే, వేగంగా నడవడం ద్వారా మరిన్ని ప్రయోజనాలున్నాయని వారు చెబుతున్నారు. దీని ద్వారా శరీరంలో అధికంగా కేలరీలు ఖర్చవుతాయి. తద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. వేగవంతమైన నడకతో కలిగే ప్రయోజనాలను చూద్దాం.


కండరాలు, కీళ్ళకు బలం
వేగవంతమైన నడకను మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా మీ శరీరం మరింత దఢంగా తయారవుతుంది. వేగంగా కండరాలను కదిలించడం ద్వారా మీ కండరాలకు బలం చేకూరుతుంది. ముఖ్యంగా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్న వారికి వేగంగా నడవడం కొంత ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది రక్త ప్రసరణను పెంచడంలో కూడా సహాయపడుతుంది.


మెరుగైన జీవక్రియ
మీరు వేగంగా నడవడానికి, మీ శరీరానికి ఎక్కువ శక్తి అవసరం. వేగంగా నడవడం ద్వారా మీ శరీర జీవక్రియను మెరుగుపడుతుంది. మీ శరీర బలాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. ఇది మీ శరీరంలో జీర్ణక్రియను కూడా ప్రేరేపిస్తుంది. దీనివల్ల మీ ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించి పొట్ట వద్ద కొవ్వును తగ్గిస్తుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad