Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeమానవిచర్మ సమస్యలు పోవాలంటే..

చర్మ సమస్యలు పోవాలంటే..

- Advertisement -

వర్షాకాలంలో సహజంగానే అనారోగ్య సమస్యలు ఎక్కువ. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు, సీజనల్‌ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. మరోవైపు చర్మ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. వర్షపు నీరు, ఉక్కపోత, చెమట కారణంగా చర్మంపై దద్దుర్లు, దురద ప్రధానంగా కన్పిస్తుంటాయి. అయితే కొన్ని వంటింటి చిట్కాలతో సులభంగానే ఈ సమస్యల్నించి గట్టెక్కవచ్చంటున్నారు చర్మ వైద్య నిపుణులు.
– స్నానానికి ముందు ఒక స్పూన్‌ బేకింగ్‌ సోడాలో నిమ్మరసం పిండుకుని మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమంతో స్నానానికి ముందు శరీరానికి మర్దనా చేసి 15-20 నిమిషాలుంచాలి. ఆ తరువాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల దురద సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.
– ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకొని అందులో వేపాకులు వేయాలి. ఆ నీళ్లను స్నానం చేసే నీళ్లల్లో కలుపుకుని స్నానం చేయాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే దురద సమస్యల్నించి గట్టెక్కవచ్చు.
– చర్మ సంబంధిత సమస్యల్ని దూరం చేసేందుకు కొబ్బరి నూనె అద్భుతమైన ఔషధంగా చెప్పవచ్చు. సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడైనా స్నానానికి ముందు కొబ్బరినూనెను శరీరానికి మర్దన చేసుకుంటే చర్మానికి పోషక గుణాలు అందించడమే కాకుండా ఇన్‌ఫెక్షన్‌ నుంచి దూరం చేస్తుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img