వేసవి కాలం రానేవచ్చింది. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య చెమట కాయలు. వీటి కారణంగా చర్మం దురద, మంట పెడుతూ ఉంటుంది. కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే చాలా సులభంగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
పెరుగు : చెమట కాయలు ఉన్న ప్రదేశంలో చల్లని పెరుగుని అప్లై చేసి 15 నిమిషాలు ఉంచాలి. తరువాత చల్లని నీటితో కడిగేసి మెత్త బట్టతో తుడవాలి. పెరుగులో సహజంగా ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ చెమట కాయలు రాకుండా చేస్తాయి.
గంధం : గంధానికి చల్లని ఫుల్ ఫ్యాట్ మిల్క్ కలిపి ఆ మిశ్రమాన్ని చెమట కాయలు ఉన్న ప్రదేశంలో పట్టించి గాలికి ఆరనివ్వాలి. ఆ తరువాత చల్లని నీటితో కడగాలి.
కలబంద : చెమటకాయలు ఉన్న ప్రదేశంలో కొంచెం కలబంద గుజ్జు రాస్తే త్వరగా తగ్గిపోతాయి. కలబందలో ఆస్ట్రిజెంట్ లక్షణాలు ఉండటం వలన చెమటకాయలు త్వరగా తగ్గటానికి సహాయపడతాయి. చర్మంపై ఉండే ఇన్‌ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది.
వెనిగర్ : టిష్యూ పేపర్‌ను తీసుకుని వెనిగర్‌లో ముంచి చెమట కాయలు ఉన్న ప్రదేశంలో అద్దాలి. ఇలా చేస్తే చెమట కాయలు త్వరగా తగ్గిపోతాయి.
లవంగ నూనె : కాటన్ బాల్‌ను తీసుకుని లవంగ నూనెలో ముంచి చెమటకాయలు ఉన్న ప్రదేశంలో రాస్తే చెమట కాయలు తగ్గుముఖం పడతాయి. తరచూ ఇలా చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
చెమటకాయలు పోవాలంటే…
- Advertisement -
- Advertisement -



