వంట వండే పాత్రల్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం. కానీ, నూనెలు స్టోర్ చేసే క్యాన్‌లు గిన్నెలు, నెలలు గడిచినా పెద్దగా క్లీన్ చేయం. దీంతో అవి కాస్తా జిడ్డుగా మారతాయి. ఇందులో ఆయిల్ క్యాన్ గురించి చెప్పాల్సిన పనేలేదు. ఎంత తోమినా జిడ్డు అంత తొందరగా వదలదు. రెగ్యులర్‌గా తోమినా మరకలు కొన్ని అలానే ఉండిపోతాయి. దీంతో విసిగిపోయి చాలా మంది క్యాన్స్‌నే మార్చేస్తారు. కానీ, చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే… జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్లు కొత్తవాటిలా మెరుస్తాయి.
గోరువెచ్చని నీటితో.. : ముందుగా జిడ్డు మరకలు త్వరగా వదలడానికి గోరువెచ్చని నీటిలో నూనె క్యాన్లను నానబెట్టండి. నానబెట్టేటప్పుడు అందులో కాస్తా వెనిగర్, నిమ్మరసం వంటివి వేయండి. దీంతో లోపలి వాసన కూడాపోతుంది. కనీసం 10 నుంచి పదిహేను నిమిషాలు అలానే ఉంచాలి. ఆ తర్వాత కొద్దిగా టూత్‌పేస్ట్, బేకింగ్ సోడా, నిమ్మరసంతో పేస్టు లాగా చేసుకోవాలి. ఈ పేస్టుని క్యాన్‌పై బాగా పట్టించాలి.
పేస్టు వద్దనుకునేవారు బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి పేస్టులా చేసి దానిని కూడా రుద్దొచ్చు. దీనిని అలానే 10 నుంచి 15 నిమిషాలు ఉంచండి.
10 నిమిషాల తర్వాత క్యాన్‌ని బ్రష్ లేదా స్క్రబ్బర్‌తో రుద్దాలి. దీంతో చాలా వరకూ మరకలు వదిలిపోతాయి. గట్టిగా రాయకుండానే జిడ్డు మొత్తం వదిలి తెల్లగా మారతాయి. అంతేకాదు, దీనిని వాడడం కూడా తేలికనే. పెద్దగా ఖర్చు ఉండదు. చాలా త్వరగా గిన్నెల్లోని మురికి మొత్తం వదులుతుంది. ఇలా క్లీన్ అయిన వాటిని నీటితో కడిగేసి ఎండలో పెట్టేయండి. దీంతో ఏ మాత్రం కాస్తా జిడ్డు వాసన ఉన్నా పోతుంది.
వెనిగర్‌తో : వెనిగర్ కూడా మంచి క్లీనింగ్ ఏజెంట్. పైన ప్రాసెస్‌లోనే టూత్‌పేస్ట్‌కు బదులు వెనిగర్‌ని యాడ్ చేసి బేకింగ్ సోడాని కలిపి మొత్తం పేస్టులా చేయండి. దీంతో క్యాన్స్‌ని రుద్దండి. స్టీల్ స్క్రబ్బర్‌తో రుద్దితే చాలా వరకూ ఫలితం ఉంటుంది. మరకలు వదలడమే కాకుండా వాసన కూడా రాదు.
జిడ్డు వదలాలంటే..
- Advertisement -
- Advertisement -