నేటి బిజీ జీవితంలో ప్రశాంతంగా నిద్రపోవడం అనేది వరం లాంటిదే. టెన్షన్స్, బిజీ లైఫ్ స్టైల్ వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతుంటారు చాలా మంది. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై పడుతున్నది. నిద్ర కూడా కరువవుతున్నది. నిద్ర లేమితో ఎకాగ్రత లోపిస్తుంది.
ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేపోతున్నామని వైద్యుల చుట్టూ తిరిగేవారూ చాలా మంది ఉన్నారు. ఈ చిట్కాలు పాటిస్తే చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది.
– నిద్ర ఆనేది శారీరక అవసరం అయినా.. దానికి మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలి. అందుకే మీరు ఆనందంగా ఉన్న క్షణాలను గుర్తు తెచ్చుకోండి. దీంతో కాస్త ప్రశాంతత కలుగుతుంది.
– టెన్షన్‌తో నిద్రపట్టకపోతే 15 నుంచి 20 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మనసుకు, శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఆందోళన తగ్గుతుంది. ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
– నిజానికి మనం ఎక్కువగా ఆలోచించడం వల్ల లేనిపోని టెన్షన్స్ మనమే క్రియేట్ చేసుకుంటాం. అందుకే అయిందేదో అయింది.. అంతా మనమంచికే.. జరిగేదేదో అది కూడా మన మంచికే అని అనుకోవడం ప్రారంభించండి. ఇలా అనుకోవడం వల్ల దిగులు తగ్గుతుంది.
– చాలా మంది ప్లానింగ్ లేకుండా పని చేస్తుంటారు. దీని వల్ల కూడా టెన్షన్ పెరిగి నిద్ర కరువు అవుతుంది. అందుకే మరుసటి రోజుకు సంబంధించి ఒక ప్లానింగ్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది. దాంతో ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం ఉంటుంది.
ప్రశాంతంగా నిద్రపోవాలంటే..
- Advertisement -
- Advertisement -