- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మండలంలోని చిన్న మల్లారెడ్డి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐ ఎఫ్ పి బి ని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక పద్ధతులు పాటిస్తూ ఉన్నత స్థాయిలో రాణించి ఎదిగి అమ్మ నాన్నలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నళిని, సి ఆర్ పి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -