నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు నిజామాబాద్ నగర 7వ మహాసభలో నూతన నగర కమిటీనీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నగర కార్యదర్శి ఎం శివ కుమార్ ఆదివారం ప్రకటించారు. అధ్యక్షుడిగా మల్లిఖార్జున్, ప్రధాన కార్యదర్శిగా ఎం శివ కుమార్, ఉపాధ్యక్షులుగా మోహన్ రాయిస్, సహాయ కార్యదర్శులుగా నర్సింగ్ రావు, కోశాధికారిగా టి.రాజు 20 మందిని కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మహాసభలో పలు తీర్మానాలు చేసినట్లు తెలిపారు.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, ఆటో రంగం వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన ఆర్థిక సహాయం అందించాలి అని, హమాలీ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 60 ఏళ్లు దాటిన కార్మికులకు నెలకు 3 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరారు. భవన నిర్మాణ కార్మికుల ఇన్స్యూరెన్స్ పథకాన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వకూడదు అని రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. వీధి వ్యాపారులకు వ్యాపారం చేసుకోవడానికి అనువైన స్థలాలు కేటాయించాలని, ప్రతి కార్మికుడికి పీఫ్, ఈఎస్ఐ ఇస్తూ, వారానికి ఒక రోజు సెలవు దినము ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.