Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐకెపి సెంటర్లు ప్రారంభించాలి

ఐకెపి సెంటర్లు ప్రారంభించాలి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ
నవతెలంగాణ – భువనగిరి

భువనగిరి పట్టణంలోని బొమ్మాయి పల్లి, రైల్వే స్టేషన్ వద్ద ఐకెపి సెంటర్లు ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు 20 రోజుల నుండి ఐకెపి సెంటర్కు ధాన్యాన్ని తెచ్చిన జిల్లా కలెక్టర్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.  20% తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసే వారిని నేడు 14 శాతం లోపటనే ఉండాలని అధికారులు చెబుతున్నారన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాల వల్ల ధాన్యము తడుచుకోవడంతోపాటు అక్కడక్కడ కొట్టుకపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. 

ధాన్య కొనుగోలు ప్రారంభించి ప్రభుత్వం ప్రకటించిన బోనస్ రూ. 500 ఇవ్వాలని కోరారు. ధాన్యము కొనుగోలు ప్రారంభించకపోతే కలెక్టరేట్ ను ముట్టడిస్తామన్నారు. ఐకెపి సెంటర్లు ఒకటి రెండు ప్రారంభించి పేపర్లకు పరిమితమవుతున్నారని తెలిపారు. భువనగిరి మున్సిపల్ పరిధిలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయా కృష్ణ పట్టణ కార్యవర్గ సభ్యులు బందేల ఎల్లయ్య, వనం రాజు  కల్లూరి నాగమణి  పట్టణ కమిటీ సభ్యులు వోల్దాస్ అంజయ్య, పర్వత్ బాలకృష్ణ, బండి రవి, కడారి సత్యనారాయణ  చిలుకూరి దానిరెడ్డి, లక్ష్మారెడ్డి, పర్వత్ కవిత  బండి చంద్రకళ, గంజి అండాలు, తుమ్మ కమలమ్మ  జిట్ట స్వర్ణలత,  రైతులు  పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -