- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మండల కేంద్రంలోని శ్రావణి మహిళ సంఘం లెక్కలలో అవకతవకలు జరిగాయని, దానిపై విచారణ జరపాలని ఆ సంఘం సభ్యురాలు గీత ఈ నెల 9న ప్రజావాణిలో మండల తాహశీల్దార్ ఎండి ముజీబ్ కు ఫిర్యాదు చేశారు. ప్రజావాణి ఫిర్యాదుపై ఐకెపి అధికారులు బుధవారం శ్రావణి మహిళా సంఘం సభ్యులను ప్రత్యేకంగా సమావేశపరిచి విచారణ చేపట్టారు.
ఈ విచారణలో సంఘం సభ్యురాలుకి లెక్కలు చూపించారు. ఆ లెక్కలలో ఎలాంటి అవకతవకలు జరగలేదని అధికారులు నిరూపించారు. అధికారుల విచారణపై ఫిర్యాదురాలు గీత సంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు ఐకెపి విచారణ అధికారులకు రాతపూర్వకంగా ఇచ్చారని ఐకెపి ఎపిఎం జగదీష్ కుమార్ బుధవారం నవతెలంగాణ విలేఖరికి తెలిపారు.
- Advertisement -



