Sunday, January 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం12న దేశవ్యాప్త సమ్మెలో ఐకేపీ వీఓఏ ఉద్యోగులు

12న దేశవ్యాప్త సమ్మెలో ఐకేపీ వీఓఏ ఉద్యోగులు

- Advertisement -

విధ్యా శాఖ కమిషనర్‌కు సమ్మె నోటీసు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఫిబ్రవరి 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పాల్గొంటారని తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) ప్రకటించింది. ఈ మేరకు శనివారం సెర్ఫ్‌ సీఈఓకు యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్‌, ఎస్వీ రమ సమ్మె నోటీసును అందజేశారు. నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.
బకాయి ఉన్న స్త్రీనిధి ఇన్‌సెంటీవ్‌ వెంటనే గ్రామా సంఘాలకు ఇవ్వాలనీ, గ్రామ సంఘం నుంచి రూ.మూడు వేల వేతనం ఇవ్వాలనీ, ప్రతి గ్రామ సంఘానికి ట్యాబ్‌, నెట్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. మూన్నెల్లకోసారి వీఓఏ రెన్యువల్‌ పద్దతి తీసేయాలని కోరారు. ప్రభుత్వ హామీ ప్రకారం రూ. 20వేల వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రూ. 20లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. గ్రామ సంఘం గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా ప్రతినెలా వేతనాలు వీఓఏల వ్యక్తిగత ఖాతాలకు చెల్లించాలనీ, కాటన్‌ బట్టల యూనిఫామ్‌ ఇవ్వాలనీ, సామాజిక భద్రత కల్పించాలనీ, ప్రమాద బీమా, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -