– బకాయిపడ్డ స్త్రీనిధి ఇన్సెంటీవ్‌ను వెంటనే చెల్లించాలి
– గ్రామసంఘాల నుంచి వీఓఏలకు రావాల్సిన రూ.3 వేల వేతనం ఇవ్వాలి : ఐబీ డైరెక్టర్ నవీన్‌కుమార్‌కు సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో పనిచేస్తున్న ఐకేపీ వీఓఏలకు రూ.20 వేల వేతనమివ్వాలని తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజ్‌కుమార్, ఎస్వీ.రమ డిమాండ్ చేశారు. వీఓఏలకు ట్యాబ్‌లిచ్చి నెట్‌సౌకర్యం కల్పించాలనీ, సెర్ప్ నుంచి గుర్తింపు కార్డులివ్వాలనీ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని సెర్ప్ కార్యాలయంలో ఐబీ డైరెక్టర్ నవీన్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. వీఓఏల సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు డైరెక్టర్లతో కమిటీ వేశామనీ, వీలైనంత త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని డైరెక్టర్ హామీనిచ్చారు. కార్యక్రమంలో ఆ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.నగేశ్, వెంకటయ్య, కోశాధికారి సుమలత, రాష్ట్ర కార్యదర్శి వసీయా బేగం, రాష్ట్ర కమిటీ సభ్యులు అంజన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ దృష్టికి పలు సమస్యలను రమ, రాజ్‌కుమార్ తీసుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయిలో పనిచేస్తున్న వీఓఏలకు గత ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం గ్రామ సంఘం నుంచి రూ.3 వేల వేతనం అందని విషయాన్ని ప్రస్తావించారు. సెర్ప్ నుంచి వచ్చే రూ.5 వేల వేతనం మాత్రమే అందుతున్నదని తెలిపారు. స్త్రీనిధి ఇన్సెంటీవ్ రెండేండ్లుగా అందట్లేదని వాపోయారు. గ్రామసంఘాల్లో ల్యాప్‌టాప్‌లు లేక ఆన్‌లైన్ పనులకు ఫోన్లు సపోర్ట్ చేయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లు ఇవ్వాలనీ, లాగిన్ అవకాశం ఐకేపీ వీఓఏలకే ఇవ్వాలని కోరారు. గ్రామ సంఘం గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా ప్రతినెలా వేతనాలను వీఓఏల వ్యక్తిగత ఖాతాల్లో జమచేయాలని కోరారు. మూడు నెలలకు ఒక్కసారి వీఓఏలను రెన్యువల్ చేసే పద్ధతిని తీసేసి కనీసం రెండేండ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. అర్హులైన వీఓఏలకు సీసీలుగా పదోన్నతి కల్పించాలని కోరారు. వీఓఏలకు రూ. 20 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని విన్నవించారు.
ఐకేపీ వీఓఏలకు రూ.20 వేల వేతనమివ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES