‘వయసు కేవలం ఓ నెంబర్ మాత్రమే. బాలకృష్ణ అంటే ఏంటో ఇక నుంచి చూపిస్తాను’ అని అన్నారు బాలకృష్ణ. మంగళవారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో ఆయన తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను జరుపుకున్నారు. అలాగే ఎన్టీఆర్ దంపతుల విహ్రానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘నా దృష్టిలో నెంబర్ పెద్ద విషయం కాదు. నా వయసు అందరికీ తెలిసిందే. తల్లిదండ్రుల దీవెనలతో 64 ఏళ్ళు పూర్తి చేసుకున్నా. మా నాన్న కోరిక మేరకు ఓసారి మెడిసిన్ ఎంట్రెన్స్ రాశాను. మెడిసిన్ చదవలేదు కానీ.. సినిమాల్లో డాక్టర్ పాత్రలు చేశాను. 15 ఏళ్ళ క్రితం బసవతారకం ఆసుపత్రికి చైర్మన్ అయ్యాను. అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యం అందించేలా కృషి చేస్తున్నాం. బాలకృష్ణ అంటే ఏంటో ఇక నుంచి చూపిస్తాను. నాకు చాలా పొగరని అందరూ అనుకుంటారు. అవును.. నన్ను చూసుకునే నాకు పొగరు. బిరుదులకు నేను అలంకారమేమో గానీ.. బిరుదులు నాకు అలంకారం కాదు. బిరుదులు వస్తుంటాయి. కానీ మన పని మనం చేసుకుంటూ పోవాలి’ అని అన్నారు.
దసరా స్పెషల్‌గా రిలీజ్
బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా ‘అఖండ 2: తాండవం’ చిత్ర టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బాలయ్య బర్త్‌డే నేపథ్యంలో గోపీచంద్ మలినేనితో చేయబోయే కొత్త సినిమాకి సంబంధించి అప్‌డేట్స్ కూడా మేకర్స్ ప్రకటించి బాలయ్య అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ కొత్త సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
బాలకృష్ణ అంటే ఏంటో చూపిస్తా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES