Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్ఇల్లంతకుంట మండల సమాఖ్య సేవలు ఆదర్శనీయం

ఇల్లంతకుంట మండల సమాఖ్య సేవలు ఆదర్శనీయం

- Advertisement -

ఆత్మ నిర్బర్ సంఘాతన్ అవార్డు స్వీకరించడం అభినందనీయం
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
కలెక్టర్ ను కలిసిన డీఆర్డీఓ, ఇల్లంతకుంట ఆదర్శ మండల సమాఖ్య బాధ్యులు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా సమాఖ్య సేవలు ఆదర్శనీయమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొనియాడారు. ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా సమాఖ్య కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆత్మ నిర్బర్ సంఘాతన్ అవార్డును ఈ నెల 14వ తేదీన కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రెటరీ నుంచి డీఆర్డిఓ, ఆదర్శ మండల సమాఖ్య బాధ్యులు అవార్డు స్వీకరించిన సందర్భంగా మంగళవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా సమాఖ్య బ్యాంకు రుణాల అందజేత, రికవరీ, క్రమం తప్పకుండా మీటింగ్ల నిర్వహణ, సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండడంపై అభినందించారు. మహిళా సంఘాలకు ఇలాగే సేవలందిస్తూ మహిళలందరూ ఆర్థికంగా రాణించేలా అవగాహన కల్పించాలని, ప్రభుత్వ పథకాల లబ్ధి మహిళలకు చేకూరేలా సహాయం అందించాలని పిలుపునిచ్చారు. ఆదర్శ మండల సమాఖ్య ను ఆదర్శంగా తీసుకుని మిగతా సంఘాలు సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి అవార్డు తీసుకున్న డీఆర్డిఓ, జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య బాధ్యులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శేషాద్రి, అదనపు డిఆర్డిఓ శ్రీనివాస్, జిల్లా, ఇల్లంతకుంట మండల ఆదర్శ సమాఖ్య బాధ్యులు ఏపీఎంలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad