- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) నాయకులు బీసీలకు 42 % శాతం తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేయాలని సామరస్యంగా ధర్నా చేస్తున్నారు. అయితే పోలీసులు అక్రమంగా ధర్నా శిబిరంపై దాడికి దిగారు. అంతటితో ఆగకుండా శిబిరం టెంట్ ను కూలగొట్టారు. అనంతరం నాయకులను బలవంతంగా ధర్నా శిబిరం నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించి, అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -