సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దూపటి వెంకటేష్
నవతెలంగాణ – ఆలేరు రూరల్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని భువనగిరి జిల్లా కేంద్రంలో దీక్ష చేపడుతున్న సీపీఐ(ఎం) నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దూపటి వెంకటేష్ ఖండించారు. శనివారం ఆలేరు మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ..బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని భువనగిరి జిల్లా కేంద్రంలో దీక్ష చేపడుతున్న సీపీఐ(ఎం) నాయకులను అక్రమంగా, అప్రజాస్వామికంగా అరెస్టు చేసి దీక్ష కార్యక్రమాన్ని భగ్నం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో దీక్ష చేయవచ్చు. కానీ సీపీఐ(ఎం) నాయకులు జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం కోసం దీక్ష చేయడాన్ని ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇకనైనా ప్రభుత్వం ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే రానున్న రోజుల్లో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్ర బీజేపీ ఎం.పి లు 42 శాతం రిజర్వేషన్ లు అమలు అయ్యే విధంగా 9 వ షెడ్యూలు లో చేర్చడానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సూదగాని సత్యరాజయ్య, జూకంటి పౌలు, నల్ల మాస తులసయ్య, పిక్క గణేష్, మిట్ట శంకరయ్య, బొమ్మ కంటి లక్ష్మి నారాయణ చౌడబోయిన యాదగిరి, సత్తయ్య,రాజు తదితరులు పాల్గొన్నారు.
అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES