Monday, April 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅంగన్‌వాడీల అక్రమ అరెస్టులు

అంగన్‌వాడీల అక్రమ అరెస్టులు

- Advertisement -

అనుమతిచ్చి అరెస్టులు తగదు:సీఐటీయూ రాష్ట్ర కమిటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

అంగన్‌వాడీలను అక్రమంగా అరెస్టు చేయడం నిరసన హక్కును కాలరాయటమేననీ, అరెస్టయిన యూనియన్‌ ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి, కోశాధికారి మంగలను వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి పిలుపునిచ్చారని తెలిపారు. ఆ నిరసన కార్యక్రమానికి పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. కానీ పోలీసులు రాత్రికి రాత్రి ఎక్కడి వారిని అక్కడ అరెస్టులకు పాల్పడు తున్నారనీ, ఇది నిరసన తెలిపే హక్కును హరించటమేననీ, ఇలాంటి నిర్భంద చర్యలను మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
సమస్యలు పరిష్కరించమంటే అరెస్టులా?
అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని పలు సార్లు ప్రభుత్వానికి విన్నవించామనీ, అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించటమే గాక, చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి వస్తున్న అంగన్‌వాడీలను, నాయకత్వాన్ని అక్రమంగా అరెస్టు చేయటమేంటని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) ప్రశ్నించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కె సునీత, పి జయలక్ష్మి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాత్రి పూట తమను అక్రమంగా అరెస్టు చేయడం తగదని ప్రభుత్వానికి హితవు పలికారు. అంగన్‌వాడీల అరెస్టును శ్రామిక మహిళ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌వీ రమ తీవ్రంగా ఖండించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -