Saturday, March 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేవీపీఎస్‌ నేతలపై అక్రమ కేసులు

కేవీపీఎస్‌ నేతలపై అక్రమ కేసులు

- Advertisement -

వెంటనే ఉపసంహరించుకోవాలి : టి స్కైలాబ్‌బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

పెద్దపల్లి జిల్లా రాఘవపూర్‌ గ్రామంలోని దళితుల స్మశాన వాటిక స్థలంలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడం దళితుల శవాన్ని పూడ్చుకునే స్థలాన్ని లాక్కోవడమేనని స్మశాన స్థల రక్షణ కోసం పోరాడుతున్న కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి కల్లేపల్లి అశోక్‌ జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి నవీన్‌ లపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌ చేయడాన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) రాష్ట్ర కమిటీ ఖండించింది.

ఈ మేరకు శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. తక్షణమే వారిపై పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రాఘవపూర్‌ గ్రామస్తులు కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో వారం రోజులుగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ జిల్లా కలెక్టర్‌, తహసీల్దార్‌ సంబంధిత అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చారని తెలిపారు. అయినా అధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. పైగా సంఘం నేతలపై తప్పుడు కేసులు నమోదు చేసి రిమాండ్‌ చేయడం తగదని హితవు పలికారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -