Wednesday, October 15, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఆదివాసీ కార్మికులను అక్రమంగా తొలగించడం అన్యాయం..!

ఆదివాసీ కార్మికులను అక్రమంగా తొలగించడం అన్యాయం..!

- Advertisement -

అక్రమంగా తొలగించడాన్ని ఖండిస్తున్నాం
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్

ఐటిడిఎ హాస్టల్స్ లో పని చేస్తున్న ఆదివాసీ కార్మికులను ఉట్నూర్ ఐటీడీఏ పీఓ అక్రమంగా తొలగించడాన్ని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయమా లేదా పీఓ వ్యక్తిగత నిర్ణయమా ప్రభుత్వం స్పష్టం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు గత నెలరోజుల సమ్మె చేస్తుంటే ఎక్కడ లేని విధంగా కొమురం భీం జిల్లా కార్మికులను పీఓ తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. 35 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో ఆదివాసీ విద్యార్థులకు సేవలు చేస్తున్న ఆదివాసీ కార్మికులకు ఇచ్చే వేతనాలనే తగ్గిస్తామని రాష్ట్ర ప్రభుత్వం జీవో 64 పేరా బెదిరింపులకు పాల్పడితే కార్మికులు సమ్మె చేయకుండా ఇంకేం చేస్తారని ప్రశ్నించారు. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సింది పోయి ఇస్తున్న వేతనంలో తగ్గించడం న్యాయమ అని పేర్కొన్నారు.

ఎనిమిది నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉంటే వేతనాలు తీసుకుంటూ సమ్మె చేస్తున్నారని పీఓ ప్రకటించడం సరైనది కాదని ఒక అధికారిలా కాకుండా రాజకీయ నాయకురాలిగా పీఓ వ్యవహరించడం సమంజసం కాదని పేర్కొన్నారు. 35 ఏండ్లుగా పనిచేస్తున్న రెండు వందల మంది కార్మికులను  ఒక్క కలం పోటుతో తొలగిస్తారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివాసీ కార్మికులు ఐటీడీఏ ముందు నిరసన వ్యక్తం చేస్తుంటే రాత్రీ పూట కరెంట్ కట్ చేయించి పోలీస్ లతో అరెస్టులు చేయించి నానా రకాల ఇబ్బందులకు గురి చేయడం చూస్తుంటే కార్మికుల పట్ల పీఓ కు ఉన్న వ్యతిరేకత అర్థం అవుతుందని పేర్కొన్నారు. ఆదివాసి కార్మికుల అక్రమ తొలగింపును  వెంటనే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని న్యాయమైన కార్మికుల డిమాండ్లు పరిష్కరించి సమ్మె విరమణకు చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -