Wednesday, April 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ పిడిఎస్ బియ్యం పట్టివేత

అక్రమ పిడిఎస్ బియ్యం పట్టివేత

- Advertisement -

– ఇద్దరిపై కేసు నమోదు
నవతెలంగాణ – కాటారం

కాటారం మండలంలో ప్రభుత్వ పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యవహారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

భూపాలపల్లి సీఆర్ నగర్ కాలనీకి చెందిన టేకం రాజబాబు, నీలిగొండ వెంకటేష్ అనే వ్యక్తులు కాటారం పరిసర గ్రామాల నుంచి రేషన్ బియ్యాన్ని కిలోకు రూ.15 చొప్పున కొనుగోలు చేసి, అధిక లాభాల కోసం మహారాష్ట్రకు ఆటోల్లో తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు అప్రమత్తమైన పోలీసులు కాలేశ్వరం వైపు వెళ్తున్న వాహనాలను తనిఖీ చేశారు.

చింతకాని క్రాస్ వద్ద ఇద్దరు నిందితులకు చెందిన రెండు ట్రాలీలను పోలీసులు పట్టుకుని పరిశీలించగా, అందులో పెద్ద మొత్తంలో పిడిఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు కాటారం ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.

ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేయడం, విక్రయించడం, అక్రమంగా తరలించడం చట్టరీత్యా నేరమని ఆయన హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -