Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ నిల్వలు..వెంటనే తరలింపు

అక్రమ నిల్వలు..వెంటనే తరలింపు

- Advertisement -

-వరదలోచ్చిన ఆగని అక్రమ ఇసుక దందా
-బెజ్జంకి క్రాసింగ్ శివారుల్లో జోరుగా అక్రమ ఇసుక నిల్వలు
-అధికారులే అండతోననే ఆరోపణలు
నవతెలంగాణ-బెజ్జంకి

అక్రమ ఇసుక రవాణకు మండలం కేంద్ర బిందువుగా మారుతోంది.అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరించడం వల్లే ఇసుక మాఫీయదారులు పెట్రేగిపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక పక్క మోయతుమ్మెద వాగులో వరదలు వస్తున్నా.. మరో పక్క మాఫీయాదారులు ఇసుక అక్రమ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. వానోచ్చిన..వరదలోచ్చిన ఇతర వ్యవస్థలు స్తంభిస్తున్నాయని..ఇసుక అక్రమ రవాణ దందా వ్యవస్థ యథేచ్చగా సాగుతోందని ప్రజలు వాపోతున్నారు. ఇసుక అక్రమ రవాణ దందాపై అధికారుల అచేతన స్థితిపై మండలంలో సర్వత్ర వినిపిస్తున్నాయి.

బెజ్జంకి క్రాసింగ్ శివారుల్లో..

రాజీవ్ రహదారి పక్కన ఉన్న బెజ్జంకి క్రాసింగ్ గ్రామం ఇసుక అక్రమ నిల్వలకు కేంద్ర బిందువుగా మారింది. ఇసుక మాఫీయదారులు గాగీల్లాపూర్ గ్రామ ఇసుక రవాణదారులతో కుమ్మక్కై మధ్యాహ్న నుండి అక్రమ ఇసుక నిల్వలు ఏర్పాటుచేసి వెంటవెంటనే జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారని స్థానికులు గురువారం చెప్పారు.అక్రమంగా రవాణ చేస్తున్న ఇసుక ట్రాక్టర్లపై అధికారులు చర్యలు చెపట్టడంలేకపోవడం వల్లే విచ్చలవిడిగా ఇసుక తరలిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మోయతుమ్మెద నుండి సిద్దిపేటకు..

కొందరు గాగీల్లాపూర్ గ్రామ ఇసుక రవాణదారులు మోయతుమ్మెద వాగు నుండి ఇష్టారీతీన ఇసుక తొడుకుని సిద్దిపేట జిల్లా కేంద్రానికి యథేచ్ఛగా తరలిస్తుండడం అధికారుల అండకు నిదర్శనంగా నిలుస్తోందని ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి.

వాహనాలను పట్టుకున్న పాపానాలేదు

బెజ్జంకి క్రాసింగ్ గ్రామ శివారుల్లోని రాజీవ్ రహదారికి ఇరువైపుల గత కొద్దిరోజులుగా మాఫీయదారులు అక్రమ ఇసుక నిల్వలు ఏర్పాటుచేసి రేయింబవళ్లు తరలిస్తున్నారు.ఇసుకను అక్రమంగా రవాణ చేస్తున్న వాహనాలను అధికారులు పట్టుకున్న పాపానాలేదు. అధికారుల అండతోనే విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణ సాగుతోంది.జిల్లాధికారులు స్పందించాలి. ఇసుక అక్రమ నిల్వలు,అక్రమ రవాణపై చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలి. -గ్రామస్తుడు, బెజ్జంకి క్రాసింగ్ గ్రామం..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -