బొలెరో వాహనంలో మంచాలు తరలిస్తుండగా పట్టుబడ్డ వైనం
నవతెలంగాణ – జన్నారం
కవ్వాల్ టైగర్ రిజర్వ్ జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని కిష్టాపూర్ లొ జోరుగా అక్రమ కలప రవాణా కొనసాగుతుంది. కిష్టాపూర్ లో కొందరు కలప అక్రమ రవాణా దారులు విలువైన టేకు కలపతో మంచాలు చేయించి అమ్ము కుంటున్నారు. ఆదివారం కిష్టాపూర్ గ్రామం నుంచి బొలెరో వాహనం( AP37TB8891) లో మంచాలు తరలిస్తుండగా మండల కేంద్రంలోని ఎఫ్డిఓ కార్యాలయం చౌరస్తాలో అటుగా వస్తున్న ఎఫ్ డి ఓ రామ్మోహన్ ఆ వాహనాన్ని ఆపి తనిఖీలు చేశారు. దీంతో వాహనంలో రూ.26వేల విలువచేసే టేకుతో చేసిన మంచాలు ఉన్నాయని, వాటిని పట్టుకొని జన్నారం అటవీ రేంజ్ కి తరలించడం జరిగిందని తెలిపారు. వాహనాన్ని కలపను సీస్ చేసామన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ . అటవీ అధికారులు కిష్టాపూర్ గ్రామం పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అక్రమ కలప రవాణా చేసిన నిలువ ఉంచిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కిష్టాపూర్ లో జోరుగా అక్రమ కలప రవాణా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



