- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా యువ నాయకుడు ఇల్యాస్ మహమ్మద్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగా ఈ సారి కూడా రంజాన్ తోఫా అందజేయడం చాల సంతోషం ఉంది అని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం లో అందరు నిష్ట తో ఉపవాసం ఉండి భగవంతు ని అందరు క్షేమంగా ఉండాలి అని కోరమన్నారు. ఈ కార్యక్రమం లో సామాజిక నాయకులు డాక్టర్ ర్యాకాల శ్రీను, సీనియర్ మైనారిటీ నాయకులు షరీఫ్, గ్రామ ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులు,మజీద్ కమిటీ ప్రెసిడెంట్ అహ్మద్,కాంగ్రెస్ నాయకులు జుబైర్, మహేందర్ లు పాల్గొన్నారు.
- Advertisement -



