Monday, January 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబాగున్నాను.. నేను పోరాట యోధుడ్ని

బాగున్నాను.. నేను పోరాట యోధుడ్ని

- Advertisement -

న్యాయవాదుల ద్వారా కుమారుడికి మదురో సందేశం
కారకస్‌ :
అమెరికా నిర్బంధంలో ఉన్న వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో తాము బాగున్నామని, దృఢనిశ్చయంతో ఉన్నామని న్యూయార్క్‌ జైలు నుంచి న్యాయవాదుల ద్వారా కుమారిడికి సందేశం పంపారు. ఈ విషయాన్ని మదురో కుమారుడు నికోలస్‌ మదురో గెర్రా శనివారం ప్రకటించారు. పాలక యునైటెడ్‌ సోషలిస్ట్‌ పార్టీ ఆఫ్‌ వెనిజులా నాయకులు, కార్యకర్తల సమావేశం కారకస్‌లో జరిగింది. దీనిలో ఎంపీ అయిన 35 ఏండ్ల గెర్రా మాట్లాడుతూ ”ఆయన బలంగా ఉన్నారని, మేము బాధపడవద్దని న్యాయ వాదులు మాకు చెప్పారు” అని అన్నారు. తన తండ్రి మాటలను ఉటంకిస్తూ, ”మేం క్షేమంగా ఉన్నాం.. నేను ఒక పోరాట యోధుడిని” అని ఆయన పేర్కొ న్నారని చెప్పారు. అమెరికా సైన్యం గతవారం మదురోను కిడ్నాప్‌ చేసి న్యూయార్క్‌ నగరంలోని బ్రూక్లిన్‌లోని మెట్రో పాలిటన్‌ డిటెన్షన్‌ సెంటర్‌లో బంధించింది. ఆ సమయంలో ఆయనకు గాయాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారని కూడా గెర్రా తెలిపారు. తన తండ్రి ఆత్మ విశ్వాసం చెక్కుచెదరలేదని, ప్రభుత్వం, పార్టీ (చావిస్మో) మద్దతుదారులు ఐక్యంగా, దఢంగా ఉన్నారని తెలిపారు. తన తండ్రి అసమాన శక్తివంతుడని, ఆయన్ని ఏ విధంగాను వారు ఓడించలేరని తెలిపారు. వెనిజులా మాజీ అధ్యక్షుడు చావేజ్‌ మనకు ఐక్యతను నేర్పారని, అమెరికా దుర్మార్గానికి వ్యతిరేకంగా వెనిజులా ప్రజలు పోరాడాలని గెర్రా పిలుపునిచ్చారు. మాతృభూమి కోసం పోరాడదాం, కారకాస్‌ చివరివరకూ నిలుస్తుంది, విజయం కోసం పోరాడదాం అంటూ ఆయన నినదించారు.

మదురో దంపతులను తిరిగి తీసుకువస్తాం : డెల్సీ రోడ్రిగజ్‌
వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగజ్‌ మిరాండా రాష్ట్రంలో శనివారం జరిగిన ఒక కమ్యూనిటీ కార్యక్రమంలో మాట్లాడుతూ మదురో, ఆయన భార్యను తిరిగి తీసుకువస్తామని ప్రతిజ్ఞ చేశారు. వెనిజులా నాయకత్వంలో, ప్రభుత్వ కార్యకలాపాల్లో ఎటువంటి అనిశ్చితి లేదని ఆమె స్పష్టంచేశారు. వెనిజులాలో అధికార శూన్యత ఉందనే అమెరికా అనుకూల మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. ”ఇక్కడ ఎటువంటి గందరగోళం లేదు. వెనిజులా ప్రజలే అధికారంలో ఉన్నారు, అధ్యక్షుడు నికోలస్‌ మదురో ప్రభుత్వమే ఇక్కడ పనిచేస్తుంది”అని ఆమె పునరుద్ఘా టించారు. శాంతి, స్థిరత్వం, దేశ భవిష్యత్తుకు హామీ ఇవ్వడానికి ఐక్యంగా ఉండాలని ఆమె ప్రజలను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -