Monday, December 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుశేఖర్‌ కమ్ములతో పోల్చడం హ్యాపీ

శేఖర్‌ కమ్ములతో పోల్చడం హ్యాపీ

- Advertisement -

‘పతంగ్‌’ సినిమా విషయంలో నాకు వస్తున్న అభినందనలు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తుంటే నా కష్టానికి తగిన ప్రతిఫలం లభించి నట్లు అనిపించింది’ అని దర్శకుడు ప్రణీత్‌ పత్తిపాటి అన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పతంగ్‌’. నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని సినిమాటిక్‌ ఎలిమెంట్స్‌, రిషన్‌ సినిమాస్‌, మాన్‌సూన్‌ టేల్స్‌ సంస్థలు నిర్మించాయి. విజయ్ శేఖర్‌ అన్నే, సంపత్‌ మకా , సురేష్‌ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. ఈ సినిమా విడుదలై యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్బంగా దర్శకుడు ప్రణీత్‌ పత్తిపాటి సోమవారం మీడియాతో మాట్లాడుతూ,’టాక్‌తో పాటు కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

యూనివర్సల్‌గా హిట్‌టాక్‌తో పాటు ఓ మంచి సినిమాని చూశామన్న సంతృప్తిని ఆడియెన్స్‌ వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా పతాక సన్నివేశాలను ఓ స్టేడియంలో మ్యాచ్‌ను చూస్తున్న అనుభూతికి లోనవుతున్నారు. క్రిస్మస్‌ సీజన్‌ వల్ల మా సినిమాకి థియేటర్లు దొరక్క పోవడంతో మొదటిరోజు బాధపడ్డాను. స్లోగా టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. సినీ పరిశ్రమ నుంచి ఎక్కువ సపోర్ట్‌ వస్తోంది. ఓవర్‌సీస్‌లో జనవరి 1న చాలా వైడ్‌గా రిలీజ్‌గా చేయబోతున్నాం. అక్కడి ఆడియెన్స్‌కి కూడా ఇంకా బాగా నచ్చుతుందని నమ్ముతున్నాను. నా టేకింగ్‌ చూసి చాలా మంది శేఖర్‌ కమ్ముల వంటి గొప్ప దర్శకుడితో పోల్చడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -