హీరో హవీష్, డైరెక్టర్ త్రినాధరావు నక్కిన క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘నేను రెడీ’. కావ్య థాపర్ హీరోయిన్.
ఈ చిత్రాన్ని హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
సోమవారం రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక టాకీ పార్ట్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. హీరోతో పాటు ప్రధాన నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘ఈ సినిమా కోసం త్రినాథరావు నక్కిన తన మార్క్‌లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్‌ని రెడీ చేశారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, వీటి గణేషన్, అజరు, మురళి గౌడ్, గోపరాజు, శ్రీకాంత్ అయ్యంగర్.. ప్రముఖ నటులంతా కీలకమైన పాత్రల్లో అలరించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. హీరో హవీష్ చాలా అద్భుతంగా నటించారు. ఆయన పోషించిన పాత్ర మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేస్తుంది. అలాగే కావ్యథాపర్ క్యారెక్టర్‌కి అందరూ ఫిదా అవుతారు’ అని మేకర్స్ తెలిపారు.
ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, దర్శకత్వం: త్రినాధ రావు నక్కిన, నిర్మాత: నిఖిల కోనేరు, కథ, డైలాగ్స్: విక్రాంత్ శ్రీనివాస్, డీఓపీ : నిజార్ షఫీ, ఎడిటర్: ప్రవీణ్ పూడి, ప్రొడక్షన్ డిజైనర్ : రఘు కులకర్ణి, సంగీతం: మిక్కీ జె మేయర్ స్టంట్స్: రామ కష్ణ, రామ్ సుంకర, కొరియోగ్రాఫర్: శేఖర్, యశ్వంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టికిరణ్ రామోజు.
కీలక షెడ్యూల్‌లో ‘నేను రెడీ’
- Advertisement -
- Advertisement -