- Advertisement -
హైదరాబాద్ : నగరానికి చెందిన అవంటెల్ లిమిటెడ్‌కు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నుంచి రూ.137.12 కోట్ల కాంట్రాక్ట్ దక్కింది. దేశవ్యాప్త వాతావరణ పర్యవేక్షణ కోసం ఏడు అత్యాధునిక విండ్ ప్రొఫైలర్ రాడార్ వ్యవస్థలను కంపెనీ సరఫరా చేయనుంది. ”జాతీయ స్థాయి కీలక మౌలిక సదుపాయాల కల్పనలో మా రాడార్, కమ్యూనికేషన్ టెక్నాలజీతో భాగస్వాములు కావడం గర్వంగా ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా వాతావరణ పరిశీలన సామర్థ్యాలు మరింత మెరుగుపడతాయి. స్వదేశీ సాంకేతికతతో వాతావరణ అంచనాలను మరింత బలోపేతం చేస్తాం.” అని సంస్థ డైరెక్టర్ సిద్ధార్థ అబ్బూరి తెలిపారు.
- Advertisement -



