టోల్గేట్ కమర్షియల్ బిల్డింగ్, నాసిరకం రహదారులు.
ప్రభుత్వ భూములు అక్రమ ఇండ్ల నిర్మాణంల పై తక్షణమే చర్యలు తీసుకోవాలి.
అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేత.
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆత్కూరీ శ్రీకాంత్.
నవతెలంగాణ – కాటారం
కాటారం సబ్ డివిజన్ పరిధిలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతుందని అక్రమ భవనాలు అనుమతి లేకుండా కడుతున్నారని నాసిరకం రహదారుల నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి అని ఆయన తెలిపారు. కాటారం సబ్ డివిజన్ అభివృద్ధి కోసం రూ.500 కోట్ల నిధులు కేటాయించి మినీ స్టేడియం, డిజిటల్ లైబ్రరీ వంద పడకల ఆస్పత్రి ఎడ్యుకేషనల్ హాబ్ బీ.ఆర్ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం వ్యాపార పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో మేడిపల్లిలో అనుమతి లేకుండా నిర్మించిన కమర్షియల్ బిల్డింగు, సబ్ డివిజన్ కేంద్రంలో ధనార్జనే ధ్యేయంగా ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఈ మధ్యకాలంలో వేసిన నాసిరకం రోడ్లపై సమగ్ర విచారణ జరిపి, కాంట్రాక్టర్ల లైసెన్సులు రద్దు చేయుటకై, ప్రభుత్వ భూముల్లో అక్రమ ఇల్లు నిర్మాణాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. నిర్మాణం ఉన్నటువంటి ప్రభుత్వ భూములపై స్టేటస్ కో రిలీజ్ చేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడే విధంగా నిర్లక్ష్య వైఖరిని వ్యవహరిస్తున్న అధికారుల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. కాటారం సబ్ డివిజన్లోని సమస్యల్ని పరిష్కరించి ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు న్యాయం చేయాలని విన్నవించినట్లు ఆయన తెలిపారు.
అక్రమ నిర్మాణాలపై తక్షణం చర్యలు తీసుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES