Monday, March 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆవులు ఎత్తుకెళ్లిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి

ఆవులు ఎత్తుకెళ్లిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి

- Advertisement -

– ప్రజావాణిలో దరఖాస్తు చేసిన జుక్కల్ గ్రామస్తులు..
నవతెలంగాణ – జుక్కల్ 

జుక్కల్ మండలం కేంద్రంలోని దేవాలయానికి సంబంధించిన ఆవులను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్టు ప్రజావాణిలో జుక్కల్ తహసిల్దార్ మారుతి కి ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. ఇప్పటికే పలుమార్లు గ్రామస్థాయి అధికారులకు సమాచారం అందించామని తెలిపారు. ఇటీవలే జుక్కల్ పోలీస్ స్టేషన్లో కూడా గ్రామస్తులు, గ్రామ పెద్దలు , యువకులు కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన జుక్కల్ పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు లేదని తెలుస్తోంది.

సోమవారం జుక్కల్ గ్రామానికి చెందిన పెద్దలు, యువకులు, గ్రామస్తులు కలిసి జుక్కల్ తహసిల్దార్ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. దేవాలయానికి సంబంధించిన ఆవులను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు, దుండగులు సుమారుగా లక్ష రూపాయల విలువైన ఆలయానికి చెందిన పశుసపదను  అపహరిచినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రజావాణిలో తామిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఆలయానికి సంబంధించిన ఆవులను ఎవరు ఎత్తుకెళ్లారో.? గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని గ్రామ పెద్దలు కోరుతున్నారు. వెంటనే ఆవుల ఆచూకీ కనిపెట్టాలని, ఎత్తుకెళ్లిన దుండగులపై చర్యలు తీసుకోవాలని జుక్కల్ గ్రామానికి చెందిన గ్రామస్తులు, గ్రామ పెద్దలు, యువకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -