- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని లోని హౌసింగ్ బోర్డు కాలనీ లోగల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల లో స్పాట్ అడ్మిషన్స్ మొదలయ్యాయి. కళాశాలలోని ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్ సి ఎస్, బిజెడ్సి, ఎంజెడ్సి, బీఏ హెచ్ఈ పీ, బీకాం బీఎ, బీకాం సిఏ, గ్రూపులలోని ఎస్సీ విద్యార్థులకు సీట్లు ఉన్నాయని, స్పెషల్ ఫేస్ మరియు స్పాట్ అడ్మిషన్ కింద వాటిని ఆగస్టు 31, వ తేదీ లోపు భర్తీ చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. ఎస్. చంద్రిక తెలిపారు. ఆసక్తి గల ఎస్సీ విద్యార్థులు వారి సంబంధిత ధ్రువపత్రాలు తీసుకువచ్చి కళాశాలలో స్పాట్ అడ్మిషన్ పొంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
- Advertisement -