Wednesday, July 30, 2025
E-PAPER
Homeజాతీయంభారీగా ఓటర్లను తొలగిస్తే తక్షణమే జోక్యం

భారీగా ఓటర్లను తొలగిస్తే తక్షణమే జోక్యం

- Advertisement -

స్పష్టం చేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ :
షెడ్యూలు ప్రకారం ఆగస్టు 1న ప్రచురించే ఓటర్ల జాబితా ముసాయిదాలో పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించినట్లు తేలితే తక్షణమే తాము జోక్యం చేసుకుంటామని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. ప్రతిపాదిత ముసాయిదాలో 65లక్షలమంది ఓటర్ల పేర్లను తొలగించారని, వీరిలో కొందరు చనిపోగా, మరికొందరు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయారని చెబుతున్నారని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రైట్స్‌తో సహా పలు ఎన్‌జీఓలు, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఆందోళన వెలిబుచ్చాయి. దానిపై స్పందిస్తూ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోమాల్యా బగ్చిలతో కూడిన బెంచ్‌ పై ప్రకటన చేసింది. ”ఎన్నికల కమిషన్‌ చనిపోయారని చెబుతున్న, కానీ జీవించి వున్న ఒక 15మందిని తీసుకురండి, మేం ఆ విషయాన్ని పరిశీలిస్తాం.” అని జస్టిస్‌ బగ్చి పిటిషనర్ల తరపు న్యాయవాదులకు సూచించారు. అయినా ముసాయిదా ప్రచురితమయ్యేవరకు వేచిచూడాలని జస్టిస్‌ కాంత్‌ పిటిషనర్లకు సూచించారు. ఇప్పటికైతే వారి భయాందోళనలు అన్నీ ఊహాజనితాలే అని భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జనవరి 7వ తేదీన గల ఓటర్ల జాబితా ప్రాతిపదికన ముసాయిదా సిద్ధమవుతోందని బగ్చి చెప్పారు. ఈ జాబితాలో వున్నవారందరూ ముసాయిదాలో వుంటారని ఈసీ ఇప్పటికే సుప్రీం కోర్టుకు అందచేసిన తన అఫిడవిట్‌లో పేర్కొంది. అందువల్ల జనవరి 2025 అనేది ప్రారంభ సూచి. మీరు చెబుతున్న 65లక్షల మంది ఓటర్లు ఆ జాబితాలో వుండి ముసాయిదాలో వుండరన్నది మీ భయంగా వుంది. అయితే ఒకవేళ ముసాయిదాలో తమపేరు లేకపోతే దిద్దుబాట్ల కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి ఈసీ షెడ్యూల్‌ ఇచ్చిందని జస్టిస్‌ బగ్చి గుర్తు చేశారు.
ఇసి తరపున సీనియర్‌ న్యాయవాది రాకేష్‌ ద్వివేది మాట్లాడుతూ, ముసాయిదాలో పేరు లేనివారు నెల రోజుల్లోగా అంటే సెప్టెంబరు 1లోగా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చునని, సెప్టెంబరు 30న తుది జాబితా ప్రచురిస్తారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -