నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లాలో వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణకై సమ్మర్ యాక్షన్ ప్లాన్ 2026 లో భాగంగా సత్వర చర్యలు తీసుకోనున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. నీటి ఎద్దడి నివారణకు వ్యవసాయ రైతుల నుండి అద్దె బోర్ల ద్వారా టెంపరరీ పైప్ లైన్స్, ఫ్లషింగ్ అండ్ డిపెనింగ్ ఆప్ బోర్వెల్స్ తదితర పనులను చేయుటకు గాను రూ. 88.15 లక్షల అంచనాలతో యాక్షన్ ప్లాన్ ను ఆమోదించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి యాదాద్రి జిల్లా పరిధిలో ఎక్కడ కూడా ఈ వేసవికాలంలో మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకొనుటకు గాను ఇట్టి పరిపాలన ఉత్తర్వులు జారీ చేసినారు. ఇట్టి పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయుటకు గాను సంబంధిత మిషన్ భగీరథ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ పి కరుణాకరన్ కి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.
నీటి ఎద్దడి నివారణకై సత్వర చర్యలు: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



