Saturday, October 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భక్తిశ్రద్ధలతో దుర్గాదేవి నిమజ్జనం

భక్తిశ్రద్ధలతో దుర్గాదేవి నిమజ్జనం

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నగరంలో దుర్గాదేవి నిమజ్జల శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వివేకానంద కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీ మాత దుర్గా దేవి సమితి ఆధ్వర్యంలో దుర్గాదేవికి పురోహితులు చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధ్యక్షులు అట్లూరి మురళీకృష్ణ మాట్లాడుతూ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం జరిగిందని శనివారం తెలిపారు. ఉదయం దుర్గాదేవి కలశం బట్టు శ్రీధర్ రాజు 18500 వేలం పాటలో దక్కించుకోవడం జరిగిందన్నారు. అనంతరం అమ్మవారికి సేవ చేసిన పలువురుని ఘనంగా జరిగిందన్నారు.

గౌతమి వినియోగదారుల సంఘం అధ్యక్షురాలు గుజ్జరాజేశ్వరి హాజరై మాట్లాడుతూ వివేకానంద కాలనీ నంబర్ వన్ గా ఉండాలని, కాలనీవాసులందరూ ఐక్యతతో కలిస్తే మెలసి ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు గుజ్జ రాజేశ్వరిని ఘనంగా సన్మానించారు. ఎల్ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. యువత సేవా కార్యక్రమం లో భక్తి మార్గంలో ముందు ఉండాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గా చెరుకు లక్ష్మణ్ గౌడ్, కోశాధికారిగా కోనేరు గంగాధర్ గౌరవ అధ్యక్షులు కిషన్, గురుమంచి శేఖర్, గురు మంచి మాధవి, గురుమంచి భార్గవ్ గురుమంచి రాఘవ, శ్యామ్ ప్రభాకర్, శ్రీనివాస్ ,నరేష్ వివేకానంద కాలనీ కార్యవర్గ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -