Tuesday, April 7, 2026
E-PAPER
Homeజాతీయంసీఈసీపై అభిశంసన తీర్మానం తిరస్కరణ

సీఈసీపై అభిశంసన తీర్మానం తిరస్కరణ

- Advertisement -

లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌ ఉత్పల్‌ కుమార్‌ ప్రకటన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని ప్రతిపక్షాలు ఇచ్చిన అభిశంసన తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తిరస్కరించారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌ ఉత్పల్‌ కుమార్‌ సోమవారం ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ను తొలగించాలని మార్చి 12న ఆర్టికల్‌ 324 (5) కింద 113 మంది పార్లమెంట్‌ సభ్యులు సంతకాలు చేసి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు నోటీస్‌ అందజేశారు. అయితే స్పీకర్‌ ఓం బిర్లా నోటీస్‌ను పరిశీలించి తిరస్కరించినట్టు తెలిపారు. దేశంలో ఓట్ల దొంగతనం, ఎన్నికల్లో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌పై ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -