యుద్ధం ఆపితేనే ప్రపంచ శాంతి
పెట్రోలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి
దేశమంతా ఇరాన్‌కు మద్దతుగా నిలవాలి
అమెరికాకు బానిసగా మోడీ
యుద్ధ వ్యతిరేక కమిటీ బహిరంగ సభలో వక్తలు
మోడీ విశ్వగురువు కాదు…బానిస గురువు : బీవీ రాఘవులు
ఆయుధాలు అమ్ముకునేందుకే యుద్ధం : నారాయణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సామ్రాజ్యవాదం విషపూరితంగా మారుతోందని యుద్ధ వ్యతిరేక బహిరంగ సభలో వక్తలు అందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం ఆపితేనే ప్రపంచ శాంతి వర్ధిల్లుతుందని అభిప్రాయపడ్డారు. యుద్ధం వల్ల పెట్రోలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రజాజీవనంపై ఆ ప్రభావం ఉంటుందని తెలిపారు. ఇరాన్ పట్ల అమెరికా అమానుషంగా ప్రవర్తిస్తోందనీ, తమ మాట వినని దేశాల్లో విధ్వంసం సృష్టించే పనిలో ఆ దేశం ఉందన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం పాలస్తీనా, గాజా, ఇరాక్, వెనిజులా, క్యూబా, ఇరాన్ ఇలా అనేక దేశాలను ఇబ్బందులకు గురి చేసిందన్నారు. ఆయా దేశాల్లో ఉన్న చమురు నిల్వల ఆధిపత్యం కోసం అమెరికా చేయని ప్రయత్నాలు లేవని విమర్శించారు. ఈ సమయంలో భారతదేశ ప్రజలంతా ఇరాన్‌కు అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్రధాని మోడీ మాత్రం అమెరికా పట్ల బానిస మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఈ ర్యాలీ అగ్రభాగంలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ జాతీయ నేత కె నారాయణ, మాజీ ఎంపీ అజీజ్‌పాషా, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ(ఎంఎల్) న్యూడె మోక్రసీ నేత చలపతిరావు, ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ‘నో వార్, నో వయలెన్స్’ అంటూ భారీ బ్యానర్‌ను ప్రదర్శించారు. అమెరికా, ఇజ్రాయిల్ ఆటలు సాగనివ్వం, సామ్రాజ్య వాదం నశించాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో ప్రజలు ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన ఎగ్జిభిషన్ గ్రౌండ్‌లో బహిరంగ సభ జరిగింది. వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, ప్రొఫెసర్లు, పలు ముస్లిం సంస్థలకు చెందిన నాయకులు కూడా మాట్లాడారు.
అమెరికా చరిత్రంతా విధ్వంసం, మారణకాండే: బీవీ రాఘవులు
అమెరికా దురాగతాలకు అంతులేకుండా పోతోందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు చెప్పారు. ఆ దేశ చరిత్ర మొత్తం విధ్వంసం, మరణకాండ సృష్టించడమేనన్నారు.గాజాలో మారణహో మాన్ని సృష్టించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ గత 30 ఏండ్లుగా సామ్రా జ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోందన్నారు. ఆ కక్షతోనే అమెరికా ఇరాన్‌పై యుద్ధం ప్రకటించిందని చెప్పారు. ఆదేశాన్ని సులువుగా లొంగదీసుకోవచ్చని అమెరికా భావించిందనీ, కానీ ఉహించని విధంగా ఇరాన్ ఎదురుదాడి చేసిందని తెలిపారు. ఈ క్రమంలో ఇండియాలోని 140 కోట్ల మంది ప్రజలు తమవాణిని ఇరాన్‌కు అనుకూలంగా వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇది కేవలం ఇరాన్ ప్రజలపై చేస్తున్న దాడి కాదనీ, ప్రపంచ ప్రజలపై దాడి అని అభివర్ణించారు. అమెరికాపై ప్రపంచ వ్యాప్తంగా ఆదివారం హైదరాబాద్‌లోని చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఈ ర్యాలీ అగ్రభాగంలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ జాతీయ నేత కె నారాయణ, మాజీ ఎంపీ అజీజ్‌పాషా, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత చలపతిరావు, ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ‘నో వార్, నో వయలెన్స్’ అంటూ భారీ బ్యానర్‌ను ప్రదర్శించారు. అమెరికా, ఇజ్రాయిల్ ఆటలు సాగనివ్వం, సామ్రాజ్యవాదం నశించాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో ప్రజలు ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన ఎగ్జిభిషన్ గ్రౌండ్‌లో బహిరంగ సభ జరిగింది. వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, ప్రొఫెసర్లు, పలు ముస్లిం సంస్థలకు చెందిన నాయకులు కూడా మాట్లాడారు.
ఆయుధాలు అమ్ముకునేందుకే : డాక్టర్ కె నారాయణ
అమెరికా చేస్తున్న యుద్ధం ప్రజల కోసం కాదనీ, తమ ఆయుధాలను అమ్ముకునేందుకేనని సీపీఐ జాతీయ నేత డాక్టర్ కె నారాయణ అన్నారు. ప్రజలకు పెట్రోలు, గ్యాస్ కొరత, నిత్యావసర వస్తువులు ధరలు ఎందుకు పెరుగుతున్నాయో అర్థమవుతోందన్నారు. పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువుల దిగుమతులు ఆగిపోయాయని తెలిపారు. యుద్ధం విషయంలో ప్రధాని మోడీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. అమెరికాకు వ్యతిరేకంగా ఆ గడ్డపై 90 లక్షల మంది నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
అదే అమెరికా నిజస్వరూపం : ప్రొఫెసర్ జి హరగోపాల్
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ ఉమ్మడిగా దాడి చేయడంతో అమెరికా నిజస్వరూపం బయటపడిందని ప్రొఫెసర్ జి హరగోపాల్ చెప్పారు. ఇరాన్‌లో టెర్రిస్టులు ఉన్నారు. అణ్వాయుధాలు ఉన్నాయంటూ అమెరికా పాలకులు సాకులు చెబుతున్నారని విమర్శించారు. ఆయుధాలు కేవలం అమెరికా చేతుల్లోనే ఉండాలా? ఇతర దేశాల్లో ఉండకూడదా? అని ప్రశ్నించారు. ఈ యుద్ధ కాలంలో మానవ విలువలు విధ్వంసం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ మతం ఎవర్నీ చంపమని చెప్పదని గుర్తు చేశారు.
ఇది అధర్మ యుద్ధం : పోటు రంగారావు
అమెరికా ప్రపంచ మానవాళికి వ్యతిరేకంగా ఆధర్మ యుద్దం చేస్తున్నదని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. ఆయిల్ వనరులపై ఆధిపత్యం కోసమే దాని తాపత్రాయమని చెప్పారు. మన దేశానికి ఇరాన్ శతాబ్దాలుగా మిత్రదేశంగా ఉందన్నారు. ఆ దేశంతో మన పాలకులు ఎన్నో ఒడంబడికలు చేసుకున్నారని తెలిపారు. ఇరాన్ ఇస్లాం విప్లవంతో అమెరికాకు ధీటుగా నిలబడిందని చెప్పారు.
న్యాయాన్ని హత్య చేస్తుంది : చలపతిరావు
ఇరాన్‌పై యుద్ధం చేస్తూ అమెరికా న్యాయాన్ని హత్య చేస్తున్నదని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమెక్రసీ సీనియర్ నేత చలపతి రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇరాన్ సార్వభౌమత్వంపై అమెరికా దాడిగా భావించాలని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు డాక్టర్ రియాజ్, నిజాముద్దీన్, హైదరాబాద్, ఖైరతాబాద్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు, ఖలేదుల్లా సైపుల్లా, మోతే రోహిత్, సీపీఐ(ఎం) కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, టి సాగర్, అబ్బాస్, మల్లు లక్ష్మి, పాలడుగు భాస్కర్, చుక్కరాములు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కార్యదర్శులు వెంకటేష్, పి యాదయ్య, సత్యం, సీపీఐ కార్యదర్శివర్గసభ్యులు ఈటీ నర్సింహ, ఎంసీపీఐ నేత తిరుపతి, ఎంబీటీ అధ్యక్షులు అజ్మాత్తుల్లాఖాన్, ఆప్ నేత అహమ్మద్ షరీప్, తాహెరీ ముస్లిం షబాన్ అధ్యక్షులు ముస్తాపా మాలిక్, ప్రొఫెసర్ రుబ్నానా సర్వత్, తారీఫ్ ఖాద్రీతోపాటు ఇతర ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొనారు.
యుద్ధాన్ని నివారించి ప్రజల ప్రాణాలు కాపాడాలి : టీపీటీఎఫ్
ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధాన్ని నివారించి, ప్రజల ప్రాణాలు కాపాడాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి విజ్ఞప్తి చేశారు. ఇతర దేశాలను ఆక్రమించాలనే యుద్ధ కాంక్షతో అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అదనపు ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్, మాజీ అధ్యక్షులు బి కొండల్‌రెడ్డి, వై అశోక్‌కుమార్, నాయకులు ఎం ప్రకాశ్‌రావు, దామెర రాజయ్య, బి ముత్యాలు, బి రాజులు, పి ఎల్లయ్య తదతరులు పాల్గొన్నారు.



