ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపల్ చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నికలు చేపట్టాలి : రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు బీఆర్‌ఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మూడు వారాల్లోగా ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపల్ చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నికను చేపట్టాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి గురువారం బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, నాయకులు కె కిషోర్‌గౌడ్, కురువ విజయ్ కుమార్, సుర్వి యాదయ్యగౌడ్ వెళ్లి విజ్ఞప్తి చేశారు. అనంతరం కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి రాజ్యాంగంపై, కోర్టులపై గౌరవం లేదన్నారు. బీఆర్‌ఎస్ గెలిచిన చోట్ల ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని దుర్మార్గాలకు పాల్పడుతున్నదని విమర్శించారు.
ఇబ్రహీంపట్నంలో 13 సీట్లు గెలిచామనీ, కాంగ్రెస్ ఏడు మాత్రమే గెలిచిందని వివరించారు. దాన్ని దుర్మార్గంగా కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నించిందని అన్నారు. క్యాతననపల్లిలో కూడా మాజీ ఎంపీ బాల్క సుమన్‌ను అరెస్టు చేసి అరాచకాలు చేసిందన్నారు. అక్రమ కేసులకు భయపడే వాళ్లు ఎవరూ లేరని చెప్పారు. ప్రభుత్వానికి తొత్తుగా మారుతున్నారా అని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించామన్నారు. మూడు వారాల్లో ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లిలో రెండు చోట్ల చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. ఆ ఆదేశాలను త్వరగా అమలు చేయాలని కోరారు.
హైకోర్టు ఆదేశాలను అమలు చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



